

ఉద్యోగులపై అమలు చేస్తున్న కఠిన నిబంధనల కారణంగా ఓ ప్రైవేట్ కంపెనీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సంస్థ నిబంధనల ప్రకారం, భోజన విరామానికి కేటాయించిన 30 నిమిషాల సమయాన్ని ఒక్క నిమిషం దాటినా, ఆ ఉద్యోగి సాయంత్రం కార్యాలయం విడిచి వెళ్లే సమయానికి అదనంగా ఒక గంట పని చేయాల్సి ఉంటుందని వెల్లడైంది. అంతేకాకుండా ఆ అదనపు గంటకు ఎలాంటి పారితోషికం చెల్లించరని సమాచారం. ఈ నిబంధన వెలుగులోకి రావడంతో ఉద్యోగుల హక్కులు, కార్యాలయ సంస్కృతి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

ఈ అంశంపై స్పందించిన పలువురు నెటిజన్లు తమ ఉద్యోగ అనుభవాలను పంచుకున్నారు. కొందరు సంస్థల్లో ఒక్క నిమిషం ఆలస్యమైనా జీతంలో కోతలు విధించేవారని తెలిపారు. ఉద్యోగుల సామర్థ్యాన్ని అంచనా వేయకుండా ప్రతి నిమిషాన్ని లెక్కించడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. మరికొందరు ఇటువంటి కఠిన విధానాలు ఉద్యోగులపై అనవసర ఒత్తిడిని పెంచుతాయని, సంస్థలు ఫలితాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ నిబంధనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!