

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి మళ్లీ అందుబాటులోకి రానుంది. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ జలసంధి తెరుచుకోవడంతో గల్ఫ్ దేశాల నుంచి చమురు రవాణా క్రమంగా పునరుద్ధరించబడే అవకాశం ఉంది. అయితే యుద్ధం కారణంగా నిలిచిపోయిన సరఫరా వ్యవస్థ పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి చేరుకోవడానికి మరికొన్ని నెలలు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఒప్పందం తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కొంత మేర తగ్గినా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. నిలిచిపోయిన నౌకలు గమ్యస్థానాలకు చేరడం, చమురు శుద్ధి ప్రక్రియ, బీమా అనుమతులు, కొత్త సరఫరా ఏర్పాట్లు పూర్తవ్వడానికి సమయం అవసరమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే భారత్కు చమురు, ఎల్పీజీ దిగుమతులు మెరుగుపడటంతో దిగుమతి వ్యయం తగ్గడం, రూపాయి బలపడటం, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం వంటి ప్రయోజనాలు కలిగే అవకాశముంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!