
క్రీడలు

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టే లక్ష్యంతో తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లు పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందింది. లోక్‌సభలో బుధవారం ఆమోదం పొందిన ఈ బిల్లుకు గురువారం రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదం అనంతరం రాజ్యసభ సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు.
పార్లమెంట్ ఉభయసభల ఆమోదంతో బిల్లు ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం లభించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడంతో పాటు పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత మరింత బలోపేతం కానుందని ప్రభుత్వం భావిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!