

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 30 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 4.50 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, 3.90 లక్షల క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.70 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని రైతులు, మత్స్యకారులు, ప్రజలు నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. వరద పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!