
జనరల్

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద ఢిల్లీ పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మూడు నెలలపాటు ఈ ప్రత్యేక అధికారాలు అమల్లో ఉంటాయి.
ఎన్‌ఎస్‌ఏ నిబంధనల ప్రకారం, జాతీయ భద్రతకు ముప్పుగా భావించిన వ్యక్తులను విచారణ లేకుండానే నిరోధాత్మకంగా ఏడాది వరకు నిర్బంధించే అధికారం పోలీసులకు ఉంటుంది. హోం శాఖ విడుదల చేసిన అసాధారణ గెజిట్ నోటిఫికేషన్‌తో ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ఈ ప్రత్యేక అధికారాలు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!