
జనరల్

ఉత్తరాంధ్రకు చెందిన పలువురు యువకులు ఇరాన్ తీరానికి సమీపంలో ఓ నౌకలో చిక్కుకుపోయారు. గత ఆరు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వీడియో ద్వారా తమ కుటుంబాలకు తెలియజేశారు. ఎంవీ పాస్కల్ అనే నౌక బందర్ అబ్బాస్ పోర్టు సమీపంలోని యాంకరేజ్ ప్రాంతంలో నిలిచిపోయింది.
నౌకలో మొత్తం 13 మంది సిబ్బంది ఉండగా, వారిలో నలుగురు విదేశీయులు. మిగిలిన వారిలో ఉత్తరాంధ్రకు చెందిన కొమర సోమరాజు (విజయనగరం), శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరికొందరు ఉన్నారు. నౌక యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆహారం, తాగునీరు కూడా సరైన విధంగా లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల ఒప్పందం ముగిసినా స్వదేశానికి పంపలేదని, జీతాలు కూడా ఇవ్వలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ వారిని వెంటనే స్వదేశానికి తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!