

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న భారత్‌పై ఇప్పటివరకు ఎల్‌నినో ప్రభావం కనిపించలేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వెల్లడించింది. అయితే, సూపర్ ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడితే దేశంలో పంటల దిగుబడులు తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడం వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతానికి భారత్‌లో ఇలాంటి ప్రతికూల ప్రభావాలేవీ కనిపించడం లేదని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జూలీ కొజాక్ స్పష్టం చేశారు.
గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వివరాలు వెల్లడించారు. వాతావరణ పరిస్థితుల వల్ల కలిగే నష్టంపై పూర్తి అంచనాలు అందిన తర్వాత వచ్చే జనవరిలో భారత్ వృద్ధి రేటు అంచనాలను విడుదల చేస్తామని తెలిపారు. కాగా, 2027, 2028 ఆర్థిక సంవత్సరాల్లో భారత్ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ ఇటీవల అంచనా వేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!