

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, కోనసీమ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లోనూ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా నవంబర్ 1, 2 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున నవంబర్ 2 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నంతో పాటు ప్రధాన ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే వాతావరణ సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!