
రాజకీయాలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్వదేశీ అంతరిక్ష సాంకేతికతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు రాత్రి 11:51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్‌ను ప్రయోగించనుంది. అంతరిక్ష, ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ రంగాల్లో భారత్ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది.
ఈ రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. భారత ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ అయిన నావిక్ (NavIC) సేవలను మరింత మెరుగుపరచడమే ఈ ఉపగ్రహ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. ఈ మిషన్ విజయవంతమైతే ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ సేవలను విస్తరించడంతో పాటు ఈ రంగంలో భారత్ స్వావలంబనను మరింత బలోపేతం చేసేందుకు దోహదపడనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!