
క్రీడలు

కర్నూలు జిల్లాలో గత ఏడాది జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కీలకంగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి కర్నూలు జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేస్తూ, సమగ్ర దర్యాప్తు నిర్వహించి నాలుగు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 2025 అక్టోబర్ 24న జరిగిన ఈ ప్రమాదంలో 24 మందికిపైగా సజీవదహనం కావడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.
ఈ ఘటనపై తమిళనాడు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన కమిషన్, ఘటనకు దారితీసిన పరిస్థితులు, బాధ్యతలు, భద్రతా లోపాలు తదితర అంశాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందించాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!