

తిరుపతి నగరంలోని 19వ డివిజన్ శ్రీ దుర్గా నగర్ కాలనీలో వినాయక చవితి మహోత్సవాలను కాలనీ ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, యువత, పెద్దలు అందరూ కలిసికట్టుగా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది కాశీ క్షేత్ర రక్షకుడైన కాలభైరవుని ప్రతిరూపంతో కూడిన మహా గణపతిని ప్రతిష్ఠించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా కాలభైరవుడిని ఉగ్రరూపంలో ఊహిస్తారని, అయితే ఆయన మనిషిలోని అజ్ఞానం, అంధకారాన్ని తొలగించే మహాశివుని పవిత్ర అవతారమనే సందేశాన్ని ప్రజలకు అందించడమే తమ ఉద్దేశమని కాలనీ యువత తెలిపారు.
కాలభైరవ గణపతి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మంటపం, అలంకరణలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కాలనీ యువతే స్వయంగా సరికొత్త ఆలోచనతో మంటపాన్ని రూపొందించడం విశేషంగా నిలిచింది. గణపతి ప్రత్యేకతను, మంటప అలంకరణను వీక్షించేందుకు తిరుపతి నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు టీడీపీ కార్యకర్తలు పెంచలయ్య, అయ్యప్ప, మణికొండ, తిలక్ తదితరులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!