
జనరల్

మహిళల ఆసియా గేమ్స్‌లో భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై 114 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. షెఫాలి వర్మ అజేయ శతకంతో చెలరేగగా, హర్మన్‌ప్రీత్ కౌర్ 40, స్మృతి మంధాన 37 పరుగులు చేశారు.
195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి 15.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. నందిని శర్మ, దీప్తి శర్మ చెరో మూడు వికెట్లు తీసి బంగ్లాదేశ్ బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. దీంతో భారత్ 114 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!