

సౌదీ అరేబియాలో హౌతీల దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగశాఖ తమ పౌరులకు భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. రియాద్‌లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని యెమెన్‌కు చెందిన హౌతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడ్డారని వార్తలు వెలువడ్డాయి. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పేలుళ్లు, భారీ పొగ కనిపించినట్లు సమాచారం. సౌదీ అధికారులు పలు దాడులను అడ్డుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికన్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే విమానాల రద్దు, వైమానిక మార్గాల మూసివేత, ప్రయాణాల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది.
అమెరికా రాయబార కార్యాలయాలు, ఇతర దౌత్య కేంద్రాలు, అమెరికా ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతాలపై కూడా భద్రతా ముప్పు ఉండే అవకాశం ఉందని తాజా హెచ్చరికల్లో పేర్కొన్నారు. సౌదీ భూభాగంపై హౌతీల దాడులు ఇటీవలి రోజుల్లో పెరగడంతో విమాన ప్రయాణాలు, పౌర మౌలిక వసతుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీలో ఉన్న తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇటలీ కూడా సూచించింది. ప్రయాణికులు అధికారిక భద్రతా సూచనలు, విమానయాన సంస్థల తాజా సమాచారాన్ని పరిశీలించిన తర్వాతే తమ ప్రయాణాలను కొనసాగించాలని సూచిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!