

బండి భగీరథ్ పోక్సో వ్యవహారానికి సంబంధించి మరో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తిపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు, దుష్ప్రచార పోస్టులు వెలువడిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు దామోదర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే వ్యవహారంలో మరికొందరిపై కూడా కేసులు నమోదు చేశారు.
ఈ కేసుల దర్యాప్తు కోసం సంయుక్త పోలీసు కమిషనర్ శ్వేత ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ నగర పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. బండి భగీరథ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే న్యాయమూర్తి భర్తకు న్యాయవాదుల మండలి అధ్యక్ష పదవి ఇస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఉన్నత న్యాయస్థాన రిజిస్ట్రార్ ఈ నెల 16న చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అనంతరం కేసును సైబర్ నేర విభాగానికి బదిలీ చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!