

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆరోగ్యం, భవిష్యత్ నాయకత్వంపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా విడుదలైన ANI పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ మాజీ రాజకీయ అధిపతి లోబ్సాంగ్ సాంగే సంచలన వ్యాఖ్యలు చేశారు. జిన్‌పింగ్ రెండు లేదా మూడుసార్లు గుండెపోటుకు గురయ్యారని తనకు ఓ మాజీ ఉన్నతస్థాయి చైనా అధికారి తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ వాదనలకు సంబంధించి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదా వైద్య నివేదికలు అందుబాటులో లేవు. జిన్‌పింగ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, ఆయన ముఖకవళికలు, నడకలో మార్పులు కనిపిస్తున్నాయని సాంగే వ్యాఖ్యానించారు.
చైనాలో సీనియర్ సైనిక జనరల్స్, రక్షణ అధికారుల తొలగింపులు లేదా వారి ఆకస్మిక అదృశ్యాలకు జిన్‌పింగ్ ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడే కారణమై ఉండొచ్చని సాంగే అభిప్రాయపడ్డారు. జిన్‌పింగ్ తర్వాతి వారసుడు ఎవరనేది కీలక ప్రశ్నగా మారిందని అన్నారు. శక్తివంతమైన వారసుడిని ప్రకటిస్తే అధికారం కోసం సవాలు ఎదురయ్యే అవకాశం ఉందని, ప్రకటించకపోతే భవిష్యత్తులో అధికార పోరాటం తలెత్తే ప్రమాదం ఉందని విశ్లేషించారు. లోబ్సాంగ్ సాంగే 2011 నుంచి 2021 వరకు సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ రాజకీయ అధిపతిగా పనిచేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!