
జనరల్

తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి కూడా నోటీసు వచ్చింది. గత ఎస్‌ఐఆర్ సమయంలో ఆయన ఓటరు వివరాల్లో ఇంటిపేరు ‘సి’ అనే అక్షరంతో మాత్రమే నమోదై ఉండగా, ప్రస్తుత ఓటరు జాబితాలో పూర్తి ఇంటిపేరు ఉండటంతో ఈ వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఆయనను అనామలీ ఓటరుగా గుర్తించి నోటీసు జారీ చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి కార్వాన్ నియోజకవర్గంలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిని (ఈఆర్‌ఓ) సంప్రదించారు. తన ఓటరు వివరాల్లో ఉన్న వ్యత్యాసంపై వివరణ ఇచ్చి, పాస్‌పోర్టును ధ్రువీకరణ పత్రంగా సమర్పించారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా జరుగుతున్న పరిశీలనలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కూడా నోటీసు అందుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!