
రాజకీయాలు

కొండా సురేఖ తమ పార్టీ టచ్‌లో లేరని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వబోమని, తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని స్పష్టం చేశారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిని మినహా మిగతా వారిని తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. అయితే పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దరఖాస్తు పెట్టినా బీఆర్‌ఎస్‌లోకి తీసుకోబోమని జగదీశ్ రెడ్డి తెలిపారు. ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ బీఆర్‌ఎస్‌లోకి వస్తామని చెప్పినా తాము అంగీకరించలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పతనం మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిని బర్తరఫ్ చేయాల్సిందని జగదీశ్ రెడ్డి అన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!