

కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనపై సిర్పూర్-కాగజ్‌నగర్ నియోజకవర్గం కౌటాలలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమ భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో 42,867 ఎకరాల భూములు 22ఏ జాబితాలో ఉన్నాయని హరీశ్‌రావు ఆరోపించారు.
రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, సమస్య పరిష్కారం అయ్యే వరకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. 22ఏ జాబితా కారణంగా బ్యాంకు రుణాలు, భూముల రిజిస్ట్రేషన్లు, రైతుబంధు, ఎరువుల లభ్యత, పంట బీమా వంటి అంశాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు, పెన్షన్లు, కల్యాణలక్ష్మి వంటి పథకాల అమలుపైనా ఆయన విమర్శలు చేశారు. ఈ అంశాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!