
సినిమాలు

జయశ్రీ మీడియా సమర్పణలో కలాల్ శ్రీనివాస్ నిర్మాతగా, నాగరాజు కొట్టే దర్శకత్వంలో తెరకెక్కుతున్న భక్తి, ఆధ్యాత్మిక చిత్రం ‘కృష్ణంభజే’. శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఫస్ట్ లుక్‌ను బ్రహ్మాజీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ‘కృష్ణంభజే’లో భాగం కావడంతో పాటు తన హృదయానికి ఎంతో దగ్గరైన ‘మార్కేండేయ’ అనే ప్రత్యేక పాత్రను పోషించడం సంతోషంగా, ఉత్సాహంగా ఉందని పేర్కొన్నారు. దర్శకుడు నాగరాజు కొట్టే, చిత్ర బృందంతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవమని, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!