

తెలంగాణలో కొత్త పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. దసరా పండుగకు ముందే అర్హులైన వారికి కొత్త పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్‌కు సూచించారు. కొత్త పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియలో ఇప్పటికే లక్షలాది దరఖాస్తులు అందినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఒంటరి మహిళలు, వితంతువులకు పూర్తి స్థాయిలో పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయి పరిశీలనను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. దసరా నాటికి కొత్త పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెన్షన్ వ్యవస్థలో వితంతువులు, ఒంటరి మహిళలు సహా పలు వర్గాలకు సామాజిక భద్రతా పింఛన్లు అందుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!