

ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం కేబినెట్ విస్తరణ చేపట్టింది. తొలి విస్తరణలో టీవీకే, కాంగ్రెస్‌కు చెందిన నాయకులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, ప్రమాణస్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ మంత్రి ఒకరు తన ప్రమాణంలో పార్టీ అగ్రనేతల పేర్లు ప్రస్తావించడంతో వివాదం చెలరేగింది. దీనిపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తీవ్రంగా స్పందించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేశ్ కుమార్, విశ్వనాథన్‌లకు మంత్రివర్గంలో చోటు దక్కింది. రాజేశ్ కుమార్ ప్రమాణం ముగించిన తర్వాత రాజీవ్ గాంధీ, కామరాజ్, రాహుల్ గాంధీ పేర్లు ప్రస్తావించడంతో గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కార్యక్రమంలో జాతీయ గీతాలు, రాష్ట్ర గీతాల ఆలాపన క్రమంపై కూడా వివాదం చెలరేగింది. సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు రాష్ట్ర గీతానికి ప్రాధాన్యం ఇవ్వలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం 23 మంది మంత్రులు ఈ కేబినెట్ విస్తరణలో ప్రమాణస్వీకారం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!