
క్రీడలు

నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయి కమిటీ జాతీయ పరీక్షా నిర్వహణ సంస్థ అధికారులను ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఎన్టీఏ అధికారులు నీట్ ప్రశ్నపత్రం పూర్తిగా లీక్ కాలేదని, కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్నట్లుగా మొత్తం పేపర్ లీక్ కాలేదని వారు కమిటీకి వివరించారు.
మే 3న వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-యూజీ పరీక్షలో పాల్గొన్న సుమారు 22 లక్షల మంది విద్యార్థుల్లో ఈ ఘటన ఆందోళన కలిగించింది. ఎన్టీఏ చీఫ్ అభిషేక్ సింగ్ పార్లమెంటరీ కమిటీకి సమాధానమిస్తూ, దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామని, పరీక్ష విశ్వసనీయతకు పెద్దగా భంగం కలగలేదని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!