

బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు నానా పటేకర్ 75 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో ఆయన అపస్మారక స్థితిలో కనిపించడంతో మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో ఉదయం 5.20 గంటలకు మృతి చెందినట్లు ప్రకటించారు.
అక్టోబర్ 4న గోవాలోని డోనా పౌలాలో జరిగిన సమ్రాట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమానికి నానా పటేకర్ హాజరయ్యారు. అదే ఆయన చివరి బహిరంగ కార్యక్రమంగా నిలిచింది. ఆ సందర్భంగా మాజీ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను గుర్తుచేసుకున్న ఆయన.. జీవితం, మరణం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో ‘పరిందా’, ‘క్రాంతివీర్’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘వెల్‌కమ్’, ‘నటసమ్రాట్’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. 2013లో పద్మశ్రీ అందుకున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!