
జనరల్

ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి 25 శాతం స్థానంలో 10 శాతం నూకల విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. దీని ద్వారా నాణ్యమైన బియ్యం సరఫరా సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఏపీ నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరణకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ అమలు చేసిన పైలట్ ప్రాజెక్ట్ స్ఫూర్తితో ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అలాగే రక్షణ దళాల స్టోర్లలో అరకు కాఫీ విక్రయాలకు కూడా కేంద్రం హామీ ఇచ్చినట్లు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!