

హోర్ముజ్ జలసంధి దిగ్బంధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ హెచ్చరించింది. అక్టోబర్-నవంబర్ వరకు ఈ సంక్షోభం కొనసాగవచ్చని తన తాజా నివేదికలో పేర్కొంది. దీని ప్రభావం భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రధాన దేశాల జీడీపీ వృద్ధి రేటు 0.2 శాతం నుంచి 0.8 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని అంచనా వేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27కు సంబంధించి భారత జీడీపీ వృద్ధి అంచనాలను మూడీస్ 6.8 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది 4.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్‌కు ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు తీసుకోవడం మరింత క్లిష్టంగా మారవచ్చని మూడీస్ అంచనా వేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!