
జనరల్

రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ అమెరికాలో ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్నారు. ఫ్లోరిడాలోని టాంపా నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) ఆమెకు హ్యూమానిటేరియన్ అవార్డును ప్రదానం చేసింది. ఆరోగ్యం, విద్య, క్రీడలు, సంస్కృతి, సమాజాభివృద్ధి రంగాల్లో ఆమె చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేశారు.
అదే కార్యక్రమంలో టాంపా మేయర్ జేన్ కాస్టర్, నీతా అంబానీకి 'కీ టు ది సిటీ ఆఫ్ టాంపా'ను బహూకరించారు. అమెరికాలో అత్యంత గౌరవప్రదమైన పౌర సత్కారాల్లో ఇది ఒకటిగా భావిస్తారు. సమాజ సేవ, దాతృత్వ కార్యక్రమాలు, మానవతా విలువలకు ఆమె చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అరుదైన గౌరవాన్ని ప్రదానం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!