
రాజకీయాలు

పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన ఆరోపణలను ఖండించింది. తెలంగాణ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ బిల్లులు, సిబ్బంది వేతనాలకు మళ్లించిందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని శాఖ తెలిపింది.
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం వీధి దీపాల నిర్వహణ, విద్యుత్ బిల్లుల చెల్లింపు గ్రామ పంచాయతీల బాధ్యతగా ఉంటుంది. టైడ్ గ్రాంట్లు నిర్దిష్ట పనులకు మాత్రమే వినియోగించబడతాయి, అన్‌టైడ్ గ్రాంట్లు అభివృద్ధి పనులకు ఉపయోగించవచ్చు. నిధులు నేరుగా స్థానిక సంస్థలకు జమ అవుతాయి కాబట్టి ప్రభుత్వం మళ్లింపు చేయడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు. ప్రజలు నిజమైన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!