
జనరల్

TG EAPCETలో రాష్ట్ర స్థాయి తొలి ర్యాంక్ సాధించిన మల్లాడి రుషి తన కలను నిజం చేసుకుంది. పరీక్షలో స్టేట్ టాప్ ర్యాంక్ సాధిస్తే మెగాస్టార్ చిరంజీవిని కలిపిస్తానని ఆమె తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి స్వయంగా రుషిని కలుసుకుని అభినందించారు.
మెగాస్టార్ చిరంజీవి రుషి ప్రతిభను కొనియాడుతూ ఆమెను సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదించారు. ఈ ప్రత్యేక క్షణం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, యువ ప్రతిభను ప్రోత్సహించిన చిరంజీవిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!