
జనరల్

మంత్రి కొండా సురేఖ రాసిన లేఖపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరోక్షంగా స్పందించారు. ప్రజల మధ్య లేని కొందరు నాయకులు వివాదాలను సృష్టించి లైమ్‌లైట్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల కంటే అనవసర వివాదాలకు ప్రాధాన్యం ఇవ్వడం సరైన విధానం కాదని సూచించారు.
తమ శాఖ అధికారులను కలవడంపై ప్రశ్నించడం అవివేకమని కడియం శ్రీహరి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులను సమీక్షించడం, ప్రజా సమస్యలను పరిష్కరించడం, ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించడం కోసం ఎమ్మెల్యేలు అధికారులను కలవడం సాధారణ పరిపాలనా ప్రక్రియేనని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!