
జనరల్

దేశవ్యాప్తంగా నేడు మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నాయి. ఆన్లైన్ ద్వారా మందుల విక్రయాలను వ్యతిరేకిస్తూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) ఈ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ-ఫార్మసీల ద్వారా మందుల అమ్మకాలు రోగుల భద్రతకు ముప్పు కలిగిస్తాయని, నియంత్రణలను దాటవేస్తున్నాయని సంఘం అభిప్రాయపడుతోంది.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మెడికల్ దుకాణాలు బుధవారం మూతపడనున్నాయి. ఈ బంద్ కారణంగా పలు ప్రాంతాల్లో మందుల లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఆన్లైన్ మందుల అమ్మకాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఏఐఓసీడీ ప్రభుత్వం ను కోరుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!