
క్రీడలు

విశాఖపట్నం శివారు గాజువాక పరిధిలోని వడ్లపూడి ఆటో నగర్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎఫ్-బ్లాక్లో ఉన్న రాధాకృష్ణ ట్రేడర్స్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్లాస్టిక్ వస్తువులు అధికంగా నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు బృందాలు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి. ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!