
జనరల్

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్, ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు సుమారు రూ.15 కోట్ల విలువైన 15 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నగరానికి చెందిన 28 ఏళ్ల ప్రయాణికుడిని అరెస్టు చేశారు. థాయిలాండ్‌లోని బ్యాంకాక్ నుంచి శుక్రవారం రాత్రి చెన్నైకి వచ్చిన ప్రైవేటు విమానంలో అతడు ప్రయాణించాడు.
తనిఖీల సమయంలో సదరు ప్రయాణికుడి ప్రవర్తనపై అధికారులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి సూట్‌కేసును తనిఖీ చేయగా 26 ప్యాకెట్లలో దాచిన 15 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి బయటపడింది. దీంతో విమానాశ్రయ పోలీసులు అతడిని అరెస్టు చేసి కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!