
రాజకీయాలు

టీడీపీ మహానాడు నేటి నుంచి రెండు రోజుల పాటు హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించబడుతోంది. పార్టీ 1,848 క్లస్టర్లలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి, కార్యకర్తలు తమ ప్రాంతాల నుంచే పాల్గొనేలా ఏర్పాట్లు చేసింది. క్లస్టర్ వారీగా నాయకులు, శ్రేణులు మహానాడులో పాల్గొననున్నారు.
“మహానాడు-2026” పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో మహిళా శక్తిని ప్రదర్శించడంతో పాటు 2029 ఎన్నికల కోసం రోడ్‌మ్యాప్ రూపొందించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తం 20 తీర్మానాలు ఆమోదించనుండగా, అందులో ఏపీ నుంచి 10, తెలంగాణ నుంచి 4, అండమాన్ నుంచి 1, అలాగే నాలుగు ఉమ్మడి తీర్మానాలు, ఒక రాజకీయ తీర్మానం ఉన్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!