

రెండు వేర్వేరు నియోజకవర్గాలు లేదా రెండు రాష్ట్రాల్లో ఓటరు నమోదును కలిగి ఉండటం ఎన్నికల చట్టాల ప్రకారం నేరమని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్నట్లు తేలితే ఏడాది వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఓటరు జాబితాలను పూర్తిగా పారదర్శకంగా, ఖచ్చితంగా ఉంచేందుకు ఎన్నికల అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.
డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్ (DSE) సాఫ్ట్‌వేర్ సహాయంతో డూప్లికేట్ ఓటరు నమోదులను సులభంగా గుర్తిస్తున్నామని సుదర్శన్ రెడ్డి తెలిపారు. అనుమానాస్పదంగా రెండు చోట్ల ఓటు నమోదైన పలువురికి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రతి పౌరుడు ఒకే చోట చట్టబద్ధమైన ఓటరు నమోదును కొనసాగించాలని, ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!