
క్రీడలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఆవర్తన ప్రభావంతో వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పిడుగులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర ప్రాంతంలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!