
జనరల్

ఉత్తర శ్రీలంక, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, కోస్తా జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.
దీని ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గత 24 గంటల్లో పాడేరులో 32.4 మి.మీ. వర్షపాతం నమోదైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!