

శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచుకోలేకపోయాడు. 62 బంతుల్లో 39 పరుగులు చేసిన పంత్.. శ్రీలంక అరంగేట్ర స్పిన్నర్ కేశర నువంత బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో పంత్ దూకుడు ఆటతీరుపై మరోసారి చర్చ మొదలైంది. మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ అతడి షాట్ సెలెక్షన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పంత్ దూకుడుగా ఆడటం అతడి ప్రత్యేకతేనని అంగీకరించిన కైఫ్.. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా షాట్లను ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త బంతి వచ్చిన తర్వాత పంత్ పలుమార్లు క్రీజు నుంచి ముందుకొచ్చి షాట్లు ఆడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని గుర్తుచేశారు. అలాంటి సమయంలో తొలి కొన్ని ఓవర్లు కాస్త ఆచితూచి ఆడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. దూకుడు మంచిదే అయినా, టెస్ట్ క్రికెట్లో సందర్భాన్ని అర్థం చేసుకుని బ్యాటింగ్ చేయాలని పంత్‌కు కైఫ్ సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!