

తెలంగాణలో సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. దక్షిణ ఒడిశా తీరం సమీపంలో ఏర్పడిన బలహీన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తాజా వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ప్రభావం అధికంగా ఉండొచ్చని అంచనా. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 50-70 మి.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. హైదరాబాద్ సహా దక్షిణ తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
ఈ అల్పపీడనం క్రమంగా బలహీనపడి విదర్భ ప్రాంతం వైపు కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని అంచనా. దీంతో సెప్టెంబర్ 15 నుంచి 17 మధ్య తెలంగాణలో వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చు. జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వర్షాల ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉండగా, అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. హైదరాబాద్‌లోనూ సెప్టెంబర్ 12-14 మధ్య మేఘావృత వాతావరణంతో పాటు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!