
సినిమాలు

ఏపీ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1.82 శాతం డీఏను 2025 జనవరి 1 నుంచి అమలు చేయనున్నారు. అలాగే 2.73 శాతం డీఏను 2024 జులై 1 నుంచి వర్తింపజేయనున్నారు. పెంచిన డీఏలను సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించనుండటంతో ఉద్యోగులు, పింఛనుదారులకు తక్షణ ప్రయోజనం కలగనుంది.
డీఏ బకాయిల చెల్లింపునకు కూడా ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. 1.82 శాతం డీఏకు సంబంధించిన 20 నెలల బకాయిలను 2028 జనవరి, మార్చి, మే, జులై నెలల్లో విడతల వారీగా జమ చేయనున్నారు. అదేవిధంగా 2.73 శాతం డీఏకు సంబంధించిన 26 నెలల బకాయిలను 2027 ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్‌లో చెల్లించనున్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ఆర్థికంగా కొంత ఊరటనివ్వనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!