
సినిమాలు

తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. మోకాలిమిట్ట ప్రాంతంలో మెట్ల పక్కన వేకువజామున సుమారు 2 గంటల సమయంలో చిరుత కనిపించింది. కొంతసేపు ఆ ప్రాంతంలో సంచరించినట్లు సమాచారం.
చిరుత సంచరించిన సమయంలో నడకమార్గంలో భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో అలిపిరి నడకమార్గంలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులుగా, జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!