
క్రీడలు

ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆయన సూచించారు. ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియలో ఉన్న సాంకేతిక సమస్యల కారణంగా ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.
ఇంటర్మీడియట్ను 11, 12 తరగతులుగా మార్చే అంశంపై విద్యా కమిషన్ నివేదిక సమర్పించనుంది. ఆ తర్వాత శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!