

విజయవాడలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గురువారం రాత్రి ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా మరమ్మతుల కోసం ఘాట్ రోడ్డును మూడు రోజులుగా పూర్తిగా మూసివేయడంతో ప్రాణ, ఆస్తి నష్టం తప్పింది. ఘాట్ రోడ్డును ముందుగానే మూసివేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని దేవస్థానం అధికారులు తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి శుక్రవారం ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు. కొండపై నుంచి జారిపడిన బండరాళ్లు, మట్టి, రాతిపెళ్లలను పొక్లెయిన్లు, క్రేన్లతో వెంటనే తొలగించాలని ఆదేశించారు. కొండచరియలు జారే ప్రాంతాలను సాంకేతిక నిపుణులతో పరిశీలించి, ప్రమాదకరమైన రాళ్లను నియంత్రిత పద్ధతిలో తొలగించాలని, రిటైనింగ్ వాల్, ఐరన్ ఫెన్సింగ్, రాక్‌ఫాల్ నెట్లను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. భద్రతా తనిఖీలు పూర్తయ్యే వరకు ఘాట్ రోడ్డుపై రాకపోకలకు అనుమతించవద్దని ఆదేశించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!