

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాయకుల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఒకరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నర్సంపేటలో నిర్వహించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. సుదర్శన్‌రెడ్డిపై ప్రజల్లో ఉన్న గౌరవం ఆయన అంతిమయాత్రకు తరలివచ్చిన భారీ జనసందోహంతో స్పష్టమైందని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి టీఆర్‌ఎస్ ఇచ్చిన ప్రతి పిలుపును పెద్ది సుదర్శన్‌రెడ్డి పెద్ద ఎత్తున నిర్వహించేవారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆయనను కాపాడేందుకు పార్టీ తరఫున సాధ్యమైనంత ప్రయత్నం చేశామని తెలిపారు. మనిషి ఎంతకాలం జీవించాడన్నది కాదని, ఎలా జీవించాడన్నదే ముఖ్యమని అన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా సుదర్శన్‌రెడ్డి పనిచేశారని కొనియాడారు. నర్సంపేటలో నిర్మించే మెడికల్ కాలేజీకి ఆయన పేరు పెడతామని ప్రకటించారు. సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!