

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయన సేవలను స్మరించుకున్నారు. సుదీర్ఘకాలం ప్రజాజీవితంలో కొనసాగిన మన్మోహన్సింగ్ అంకితభావంతో దేశానికి సేవలందించారని మోదీ పేర్కొన్నారు. చారిత్రక ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ రూపురేఖలను మార్చిన దార్శనిక రాజనీతిజ్ఞుడిగా మన్మోహన్సింగ్ సేవలను ఖర్గే గుర్తు చేసుకున్నారు. వినయం, హుందాతనం, బుద్ధికుశలత ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకలని ఖర్గే పేర్కొన్నారు.
దిల్లీలోని అక్బర్ రోడ్డులో ఉన్న ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మన్మోహన్సింగ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మన్మోహన్సింగ్ కుటుంబసభ్యులు నిర్వహించిన ప్రార్థన కార్యక్రమానికి రాహుల్ హాజరయ్యారు. దూరదృష్టితో దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాజిక న్యాయానికి కొత్త దిశను అందించిన నాయకుడిగా మన్మోహన్సింగ్ను రాహుల్ కొనియాడారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!