

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న ఈ పోటీలను రాష్ట్రంలోని ఆరు నగరాల్లో నిర్వహించనున్నారు. మొత్తం 27 క్రీడాంశాల్లో పోటీలు జరగనుండగా, 7,500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది. యువ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకునేందుకు ఈ క్రీడలు మంచి వేదికగా నిలవనున్నాయి.
హైదరాబాద్‌లోని హుసేన్ సాగర్‌లో నిర్వహించనున్న వాటర్ స్పోర్ట్స్ పోటీలు ఈ క్రీడలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు స్పోర్ట్స్ పాలసీపై దృష్టి సారిస్తోంది. యువ ప్రతిభను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ, మౌలిక వసతులు అందించడం ద్వారా భవిష్యత్‌లో ఒలింపిక్ పతకాలు సాధించే క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!