
జనరల్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక రైల్వే అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించారు. అన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం అందించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ పనులు కొనసాగుతున్నాయని, ఎంఎంటీఎస్‌ను యాదగిరిగుట్ట వరకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
కొమురవెల్లి రైల్వే స్టేషన్ ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానుందని వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు రూ.720 కోట్లు, నాంపల్లి స్టేషన్ అభివృద్ధికి రూ.350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్‌ను బెంగళూరు, పూణే, చెన్నై నగరాలతో కలిపే హైస్పీడ్ కారిడార్ ప్రణాళికలు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!