
జనరల్

నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభమైంది. పులుల సంతానోత్పత్తి ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని మూడు నెలలపాటు జంగిల్ సఫారీని అధికారులు నిలిపివేశారు. సీజన్ గడువు ముగియడంతో తిరిగి పర్యాటకులకు సఫారీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
జంగిల్ సఫారీతో పాటు నల్లమల అటవీ ప్రాంతంలోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు కూడా అధికారులు అనుమతి కల్పించారు. దీంతో పర్యాటకులు, భక్తులు నల్లమల ప్రాంతాన్ని సందర్శించేందుకు మార్గం సుగమమైంది. అటవీ ప్రాంతంలోకి వెళ్లే సమయంలో పర్యావరణ, అటవీ శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!