

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలవనున్న రిలయన్స్ జియో ఐపీఓకు కీలక ముందడుగు పడింది. జియో ప్లాట్ఫార్మ్స్ బోర్డు ఆమోదంతో మెగా ఐపీఓకు సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లను సెబీకి సమర్పించింది. సుమారు రూ.25 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా 27 కోట్ల కొత్త షేర్లను ఇన్వెస్టర్లకు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రకటనతో జియో ఐపీఓపై మార్కెట్లో భారీ ఆసక్తి నెలకొంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశంలో మాట్లాడిన ముఖేశ్ అంబానీ, జియో ఐపీఓను రిలయన్స్‌కు అత్యంత కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఈ ఐపీఓ ద్వారా ఇప్పటికే ఉన్న వాటాదారులకు మరింత విలువ లభించడంతో పాటు కొత్త పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశం లభిస్తుందని తెలిపారు. డ్రాఫ్ట్ పేపర్లు దాఖలు చేసే నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో 66.43 శాతం వాటా ఉన్నట్లు వెల్లడైంది.
గత ఏడాది జరిగిన రిలయన్స్ ఏజీఎంలో 2026 తొలి అర్ధభాగంలో జియో ఐపీఓ తీసుకురానున్నట్లు ప్రకటించినప్పటికీ, పలు కారణాలతో ప్రక్రియ ఆలస్యమైంది. తాజాగా సెబీకి డ్రాఫ్ట్ పేపర్లు సమర్పించడంతో ఐపీఓ ప్రక్రియ అధికారికంగా ముందుకు సాగుతోంది. 27 కోట్ల కొత్త షేర్ల జారీతో భారత మూలధన మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూలలో ఒకటిగా జియో ఐపీఓ నిలవనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!