

దుబాయ్‌లోని జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం రాత్రి వరుస పేలుళ్లు చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం సుమారు 20 నిమిషాల వ్యవధిలో ఏడు భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పేలుళ్ల అనంతరం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకోగా, ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాశ్రయాల్లో ఒకటైన జెబెల్ అలీ పోర్టు సమీపంలోని ఇంధన నిల్వ, రవాణా గిడ్డంగిలో మంటలు చెలరేగినట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి.
ఈ ఘటనలో ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడలేదు. పేలుళ్ల వెనుక హూతీల హస్తం ఉందని కొన్ని మీడియా కథనాలు పేర్కొనగా, యెమెన్ నుంచి క్షిపణి దాడి జరిగిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదనలను యూఏఈ అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు. పేలుళ్లకు గల అసలు కారణాలపై అధికారిక దర్యాప్తు కొనసాగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!