

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి కాలంలో 'ఎక్స్' కంటే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎక్కువగా చురుకుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా షార్ట్ రీల్స్ రూపంలో వీడియోలు పంచుకుంటూ యువతతో నేరుగా సంభాషించే ప్రయత్నం చేస్తున్నారు. పేపర్ లీక్ ఆందోళనల వంటి అంశాలపై కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే స్పందిస్తూ ఇప్పటివరకు పలు వీడియోలను పంచుకోవడం చర్చనీయాంశమైంది.
మోదీ 2014లోనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించినప్పటికీ, అప్పట్లో అప్పుడప్పుడు మాత్రమే ఫొటోలు, వీడియోలు పోస్టు చేసేవారు. అయితే ఇప్పుడు స్వయంగా వీడియోల ద్వారా మాట్లాడడం ఆయన డిజిటల్ కమ్యూనికేషన్ శైలిలో మార్పును సూచిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా జెన్ జీ యువతను మరింత చేరువ చేసేందుకు సోషల్ మీడియా వ్యూహంలో భాగంగా ఈ మార్పు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక వివరణ వెలువడలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!